Winning entries could not be determined in this language pair.There were 4 entries submitted in this pair during the submission phase. Not enough votes were submitted by peers for a winning entry to be determined.Competition in this pair is now closed. |
చాలా సంవత్సరాల కాలంగా, ఎటువంటి ఆర్భాటము,హడావిడి లేకుండా, న్యూయార్క్ అధికారులు నగరములో పాదచారుల కూడలి దీపాలను నియంత్రించే మీటలను నిరుపయోగముగా మార్చారు. కంప్యూటరీకరించిన టైమర్లు, దాదాపుగా ఎల్లప్పుడూ, మెరుగ్గా పనిచేస్తాయని మేలైనవని వాళ్ళు నిర్ణయించారు.2004 నాటికి, 3,250 మీటలలో 750 కంటే తక్కువ మీటలు క్రియాశీలంగా ఉన్నాయి. 2004 నాటికి, 3,250 మీటలలో 750 కంటే తక్కువ మీటలు క్రియాశీలంగా ఉన్నాయి.కాని, నగర ప్రభుత్వం ఆ నిరుపయోగమైన మీటలను తొలగించలేదు - పర్యవసానంగా అనేకమైన చేతి వేళ్ళు ఆ మీటలను ఫలితం లేకుండా నొక్కుతున్నాయి. తొలినాళ్లలో, తీసివేయటానికి అయ్యే ఖర్చు వాళ్ళ ఆ మీటలను తొలగించలేదు. కానీ పని చేయని మీటలకు కూడా ఒక ప్రయోజనం ఉంటుందని వెల్లడైంది. మీట నొక్కిన తరువాత ఆకుపచ్చని మనిషి సంకేతం కనపడే వరకు పాదచారులు కూడలి దాటే అవకాశం తక్కువ, అని బెన్-గురియోన్ యూనివర్సిటీ అఫ్ ది నేగేవ్, ఇజ్రాయెల్ కి చెందిన టాల్ ఆరోన్-గిలాడ్ చెబుతున్నారు. కూడలి దగ్గర ప్రవర్తనను పరిశీలించి, ఆవిడ గమనించినది ఏమిటంటే ప్రజలు తమ కోరికను అర్ధం చేసుకొనే ఒక వ్యవస్థను మనస్ఫూర్తిగా అంగీకరిస్తారు. నిష్ఫలమైన, వ్యర్ధమైన మీటలు ఇటువంటి ప్లేసిబో ప్రభావాన్ని చూపిస్తాయి ఎందుకంటే ప్రజలు తాము ఉపయోగించే వ్యవస్థ మీద తమ నియంత్రణ ఉండడం ఇష్టపడతారు, అని మిచిగాన్ విశ్వవిద్యాలయం,ఆన్ అర్బోర్ కి చెందిన మానవ-కంప్యూటర్ సహచర్యల నిష్ణాతులు, ఏయ్టాన్ అడార్ తెలుపుతున్నారు. డాక్టర్ అడార్ మాట్లాడుతూ తన విద్యార్థులు సాధారణముగా సాఫ్ట్ వేర్ రూపొందించేటప్పుడు క్లిక్ చేయటానికి వీలుగా "సేవ్" మీటను కేవలం కీ స్ట్రోక్స్ స్వతస్సిద్ధంగా నిక్షిప్తమవుతాయి అని తెలియని వినియోగదారులను సంతృప్తి పరచటానికి మాత్రమే ఉంచుతున్నారు. ఇంకా ఆయన , దానిని సహజముగా యాంత్రిక ప్రపంచంలో ఉండే ఒక ఉదాసీనతకు వ్యతిరేకముగా ఒక ఉత్సాహవంతమైన భ్రాంతి లాగా భావించమంటున్నారు. అది ఒక దృక్పధం. కానీ, రహదారి కూడలిలో మాత్రం, ప్లేసిబో ప్రభావానికి ఒక చీకటి కోణం కూడా ఉంది. ట్రాఫిక్ వ్యవస్థల్లో మానసిక అంశాలను విశ్లేషించే వియన్నాకి చెందిన, ఫాక్ట్మ్ సంస్థ ప్రధానాధికారి, రాల్ఫ్ రిస్సేర్ అంచనా ప్రకారం, పాదచారులకు వాటి ఉనికి కి సంబందించిన స్పృహ, ఇంకా దాని పర్యవసానముగా మోసపాయం అనే భావన వల్ల కలిగే ఆగ్రహం, ఇప్పుడు మేలు కంటే కీడే ఎక్కువ చేస్తుంది. | Entry #25640 — Discuss 0 — Variant: Not specified
|
ఎన్నో సంవత్సరాలుగా, అది కూడా ఎటువంటి ఫిర్యాదులు లేకుండా ఒకప్పుడు నగరంలో పాదచారులు దాటు మార్గాలని నియంత్రించిన చాల వరకు బటన్లని న్యూయార్క్ నగర అధికారులు నిరోధించారు. వాళ్ళు నిర్ణయించిన కంప్యూటర్ ఆధారిత టైమర్లు ఎప్పుడూ కూడా సరిగ్గానే పని చేసాయి. 2004 నాటికి అటువంటి 3,250 బటన్లలో కనీసం 750 క్రియాశీలకంగా వున్నాయి. నిత్యం ఎన్నో వేళ్ళకి ఇలాంటి నిరర్థక వాడకాన్ని ప్రోత్సహిస్తూ ప్రభుత్వం కనీసం ఆ పని చేయని బటన్లని తొలగించ లేదు కూడా. మొదట్లో ఈ బటన్లని తొలగించడానికి కావాల్సిన ఖర్చు కారణంగా అవి అలాగే ఉంచబడ్డాయి. అయితే చివరికి క్రియాశీలకంగా లేని ఈ బటన్లే ఇప్పుడు ఒక మంచి కారణం కోసం ఉపయోగపడుతున్నాయి. ఈ బటన్ నొక్కే పాదచారులు గ్రీన్ మ్యాన్ చిహ్నం కనిపించడానికి ముందే రోడ్డు దాటే అవకాశాలు చాలా తక్కువని అంటున్నారు ఇజ్రాయెల్‌లోని బెన్-గురియన్ విశ్వవిద్యాలయానికి చెందిన తాల్ ఓరాన్-జిలాడ్. క్రాసింగుల దగ్గర మానవ ప్రవర్తనపై పరిశోధన చేసిన ఈమె గారు మనుషులు తామిచ్చే ఆదేశాలను స్వీకరిస్తున్నట్లుగా ప్రవర్తించే వ్యవస్థపై ఎక్కువ విధేయత చూపిస్తారని చెప్తున్నారు. పని చేయని ఇలాంటి బటన్లు ప్లేసిబో ఎఫెక్టులు (నకీలీ ప్రభావం) సృష్టిస్తాయని, ఎందుకంటే మానవులు వాళ్ళు ఉపయోగిస్తున్న వ్యవస్థలపై నియంత్రణని కలిగి వుండటం అనే భావనని ఇష్టపడతారని అంటున్నారు ఎన్ ఆర్బర్‌లోని యూనివర్శిటీ ఆఫ్ మిచిగాన్‌కి చెందిన, మానవుడు-కంప్యూటర్ సంబంధం అంశం యొక్క నిపుణుడు ఎయితన్ ఆదర్. తన విద్యార్థులు సాధారణంగా క్లిక్కుతో కూడిన, "సేవ్" బటన్ కలిగిన ఒక సాఫ్ట్‌వేరుని రూపొందిస్తారని. అది కేవలం తామిచ్చే కీ స్ట్రోకులు వాటంతట అవే సేవ్ అవుతున్నాయనే విషయం తెలియని వాళ్ళకి భరోసా ఇవ్వడం తప్ప మరే ఇతర పాత్ర పోషించదని డా. ఆదర్ చెప్తున్నారు. దీన్ని ఈ యాంత్రిక ప్రపంచం యొక్క శాశ్వత లక్షణమైనటువంటి ప్రేమ లేని తత్వానికి విరుగుడిగా అందించే ఒక దయతో కూడిన,మోసపూరిత స్పర్శగా భావించాలని ఆయన పేర్కొన్నారు. అయితే అది ఒక కోణం మాత్రమే. రహదారి క్రాసింగుల వద్ద ఈ ప్లేసిబో బటన్లు ప్రతికూలతలని కూడా కలిగించవచ్చు. ట్రాఫిక్ వ్యవస్థలపై మానసిక కారకాల మీద పరిశోధన చేస్తున్న వియన్నాకి చెందిన ఫాక్టం (FACTUM) అనే ఒక సంస్థ అధినేత రాల్ఫ్ రిస్సర్ అభిప్రాయం ప్రకారం పాదచారులకి సంబంధించి వారి ఉనికి యొక్క అవగాహన, పదే పదే ఈ మోసం పైన వారి ఆగ్రహం ప్రస్తుతానికి అనుకూల ప్రయోజనాలని కూలదోస్తున్నాయట. | Entry #25457 — Discuss 0 — Variant: Not specified
|
చాలా సంవత్సరాల కాలంలో, దాని గురించి ఏ గడిబిడి చేయకుండా, నగరంలో పాదచారుల-దాటుతున్న లైట్లు ఒకసారి పనిచేసే నియంత్రణ బటన్లను న్యూయార్క్ అధికారులు చాలావరకు నిలిపివేశారు. కంప్యూటర్ టైమర్లు కోసం, వారు నిర్ణయించుకున్నారు, ఎప్పుడూ మంచి పనే చేసామని. 2004 నాటికి, ఇటువంటి 3,250 బటన్లు 750 కంటే తక్కువగా ఉన్నాయి. అయితే నగర ప్రభుత్వం మాత్రం పని చేయని బటన్లను లెక్కలేనన్నివి—విసిగిపోకుండా వేళ్ళను వదలివేయలేదు. మొదట్లో, వాటిని తొలగించే ఖర్చు కారణంగా బటన్లు కొనసాగుతున్నాయి. కానీ కొన్ని పనికిరాని బటన్లు కూడా ఒకదానికి ప్రయోజనంగా ఉంటుంది. గ్రీన్ సిగ్నెల్ కనిపించే ముందు ఒక బటన్‌ను నొక్కే పాదచారులు తక్కువగా ఉంటారు, ఇజ్రాయెల్‌లోని నెగేవ్ యొక్క బెన్-గురియన్ యూనివర్సిటీ యొక్క తల్ ఓరోన్-గిలాడ్ చెప్పారు. క్రాసింగ్‌ల వద్ద ప్రవర్తనను అభ్యసించిన తరువాత, తమ ఇన్పుట్ను లక్ష్యంగా పెట్టుకునేందుకు ఉద్దేశించిన ఒక వ్యవస్థను ప్రజలు మరింతగా కట్టుబడి ఉంటారని ఆమె పేర్కొన్నారు. సరిగ్గా పనిచేయని బటన్లు ఈ విధమైన ప్లేసిబో ప్రభావాలను ఉత్పత్తి చేస్తాయి, ఎందుకంటే వారు ఉపయోగిస్తున్న వ్యవస్థలపై కంట్రోల్ గా ఉంటారు, ఐతాన్ అడార్, మిచిగాన్ యూనివర్శిటీలో ఆన్-అర్బోర్లో మానవ-కంప్యూటర్ పరస్పర చర్చకు నిపుణుడు చెప్పారు. తన విద్యార్థులను సాధారణమైన క్లిక్ చేసే "సేవ్" బటన్‌తో సాఫ్ట్‌వేర్‌ను తయారు చేస్తున్నారని డాక్టర్ అడార్ పేర్కొన్నాడు, వారి కీస్ట్రోక్‌లు ఎలాగైనా ఆటోమేటిక్‌గా సేవ్ అవుతాయని తెలియకుండానే వారికి నమ్మకం ఇవ్వకుండా ఇతర విషయాలు లేవు. దాని గురించి ఆలోచించండి, యంత్ర ప్రపంచంలో సహజమైన వాతావరణాన్ని ఎదుర్కోవడానికి అనుకూలంగా ఉన్న ఒక స్పర్శ ఉంటుందని అతను చెప్పాడు. ఇది ఒక దృశ్యం. కానీ, రహదారి క్రాసింగ్లలో కనీసం, ప్లేసిబో బటన్లు కూడా చీకటి వైపు ఉండవచ్చు. ట్రాఫిక్ వ్యవస్థల్లో మానసిక కారకాలు అధ్యయనం చేసే వియన్నీస్ సంస్థ, ఫ్యాక్టమ్, రాఫ్ రిసర్, వారి రావడం చూసి పాదచారుల జాగ్రత్త పడతారు మరియు మోసగింపులో పర్యవసానమైన, ఇప్పుడు ప్రయోజనాలను అధిగమిస్తుంది. | Entry #25513 — Discuss 0 — Variant: Not specified
|
కొన్ని సంవత్సరాలలో, దాని గురించి పెద్దగా రచ్చ చెయ్యకుండా, న్యూ యార్క్ లో ఉన్న అధికారులు ఒకప్పుడు నగరంలో పనిచేసే నడకకు సంబంధించిన దాటించే లైట్ల కంట్రోల్ బటన్లను పనిచేయకుండా చేస్తూ వచ్చారు. కంప్యూటరీకరణమైన టైమర్లు, వాళ్ళ ప్రకారము ఎప్పుడూ మెరుగ్గా పనిచేశాయి. కాని 2004 సంవత్సరం నాటికి 3250 బటన్లలో, 750 కంటే తక్కువ బటన్లు పనిచేస్తున్నాయి. కానీ నగర ప్రభుత్వం అటువంటి పనిచేయని బటన్లను తీసివేయలేదు – తత్ఫలితంగా ఎన్నో లెక్కలేని వ్రేళ్ళు నిరర్ధకంగా నొక్కుతూనే ఉన్నాయి. మొదట్లో, వాటిని తీసివేయటానికి అయ్యే ఖర్చు రీత్యా అలాగే ఉంచబడ్డాయి. కాని వాడని బటన్లు కూడా ఒక ఉద్దేశ్యము ను అనుసరిస్తాయని తేలింది. కాలినడకన వెళ్ళేవారు బటన్ ను నొక్కినప్పుడు, ఒక పచ్చ మనిషి వచ్చే ముందే, దాటే సూచనలు తక్కువ అని అంటున్నారు ఇస్రాయిల్ లోని బెన్ గురియన్ విశ్వవిద్యాలయం యొక్క టాల్ ఒరోన్-గిలాడ్. ఆమె రోడ్డును దాటే ప్రవర్తనను అధ్యయనం చేయగా, ప్రజలు వారి యొక్క స్వప్రయత్నమునకు ప్రాధాన్యతనిచ్చే ఒక విధానాన్ని చాలా ఉత్సాహంగా, విధేయతతో పాటిస్తారు అని తెలుసుకున్నారు. పనిచేయని బటన్లు ఇలాంటి నకిలీ ప్రభావాలను ఇస్తాయి. ఎందుకంటే, ప్రజలు వారు వాడే వస్తువుల మీద నియంత్రణ ఉంచుకోవటానికి ఇష్టపడతారు అని, ఆన్ ఆర్బర్‌లోని మిషిగన్ విశ్వవిద్యాలయంలో మనిషి-కంప్యుటర్ పరస్పర నిపుణుడైన ఐటన్ ఎదర్ అన్నారు. డాక్టర్ ఎదర్ తన విద్యార్థులు ఒక సాధారణ సాఫ్ట్ వేర్ ని తయారుచేస్తారని, అందులో “సేవ్” అనే బటన్ కేవలం వాడుకదారును శాంతపరచటానికి తప్ప వారి వ్రేళ్ళ ప్రమేయం లేకుండానే “సేవ్” స్వయంచాలకంగా జరిగిపోతుందని తెలియని వాడుకదార్ల కోసం మాత్రమే ఆ సాఫ్ట్ వేర్ అని తెలుసుకున్నాడు. దాని గురించి ఇలా ఆలోచించండి అని అతను అంటారు, “యాంత్రిక ప్రపంచం యొక్క స్వాభావికమైన చల్లదనాన్ని ఎదుర్కోవటానికి దయతో కూడిన మోసం యొక్క స్పర్శలా ఉంటుంది” అని. ఇది ఒక వైపు నుంచి కనిపించేది. కాని, రోడ్ క్రాసింగ్ దగ్గర కనీసం, నకిలీ బటన్లకు చీకటి కోణం కూడా ఉండవచ్చును. ట్రాఫిక్ వ్యవస్థ పైన మానసిక కారణాలను అధ్యయనం చేస్తున్న వియన్నా సంస్థ అయిన FACTUM అధికారి, రాల్ఫ్ రిస్సర్ యొక్క అంచనా ప్రకారం, నడక దారిలో వెళ్ళు ప్రజలు ట్రాఫిక్ గురించి తెలుసుకోవటం ఆతరువాత మోసం వల్ల విసిగిపోవటం, ట్రాఫిక్ వ్యవస్థ ఉపయోగాలను అధిగమిస్తుంది. | Entry #25607 — Discuss 0 — Variant: Not specified
|